డ్రాగన్ తో సోషల్ మీడియాను ఊపేస్తోంది యంగ్ హీరోయిన్ కయాదు లోహర్.ఇందులో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా కయాదు ఓ హీరోయిన్ గా చేసింది. నాలుగు రోజుల క్రితం విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.ముఖ్యంగా కయాదు గ్లామర్ యూత్ ను ఫిదా చేస్తుంది.ఈసినిమాతో తనకు వస్తున్న ఫాలోయింగ్ చూసి దర్శక నిర్మాతలు అప్ కమింగ్ ప్రాజెక్ట్ లలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో భాగంగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించనున్న నెక్స్ట్ మూవీ ఫంకీలో కయాదు లోహర్ ను హీరోయిన్ గా లాక్ చేయాలనుకుంటున్నారట. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. అయితే ఈసినిమా కోసం ముందుగా ఆషికా రంగనాథ్ పేరు వినిపించింది.ఆ తరువాత కృతి శెట్టి పేరు ను కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈజాబితాలో కయాదు లోహర్ కూడా చేరింది.
కయాదు ను ఓకే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.త్వరలోనే ఈవిషయంలో క్లారిటీ రానుంది. ఇక ఇంతకుముందు కయాదు అల్లూరి అనే సినిమా తో తెలుగులో కి ఎంట్రీ ఇచ్చింది.శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక అన్ని కుదిరితే కయాదుకి ఫంకీ రెండో సినిమా కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: