కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘మ్యాడ్’ సినిమాకి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మార్చి 29న ఈ సినిమా విడుదలకానుంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టేసారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మ్యాడ్ స్క్వేర్ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఫుల్ ఫన్‌తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. చూడబోతుంటే, ఫస్ట్ పార్ట్‌కి మించి హిట్ కొట్టేలావుంది.
ఇక గతేడాది మార్చి 29న వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ 100కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. మ్యాడ్ స్క్వేర్‌ను కూడా ఇదే సంస్థ నిర్మిస్తుంది. దాంతో సెంటిమెంట్‌గా అదే డేట్‌ను లాక్ చేశారు. టిల్లు స్క్వేర్ కూడా సీక్వెలే. మరి మ్యాడ్ స్క్వేర్‌కి కూడా ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: