హిట్ 3 టీజర్ కు రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్

Hit 3 teaser gets record-breaking views on YouTube.

హ్యాట్రిక్ విజయాల తరువాత నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ హిట్ 3తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.హిట్ ఫ్రాంఛైజీ లో థర్డ్ పార్ట్ గా వస్తున్న ఈసినిమాలో నాని,అర్జున్ సర్కార్ పాత్రలో రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నిన్న ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దీనికి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.కేవలం 24 గంటల్లో సింగిల్ లాంగ్వేజ్ రిలీజై 17 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో మొదటి స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.అంతేకాదు తెలుగు సినిమాల్లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన 7వ టీజర్ గా హిట్ 3 రికార్డు సృష్టించింది.ఈ క్రేజ్ చూస్తుంటే హిట్ 3 భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం గా కనిపిస్తుంది.

అయితే టీజర్ మరీ వైలెంట్ గా ఉండడం తో సినిమాకు ఏ సర్టిఫికేట్ రానుంది.అదే జరిగితే నాని కెరీర్ లో హిట్ 3 మొదటి ఏ రేటెడ్ సినిమా కానుంది.శైలేష్ కొలను ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తుండగా మే 1న ఈసినిమా విడుదలకానుంది.

ఈసినిమా తరువాత నాని ,శ్రీకాంత్ ఓదెల తో ది ప్యారడైజ్ చేయనున్నాడు.ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దసరా, నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.దాంతో ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్


మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.