లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు హీరో &డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్.ఈసినిమాకు తనే డైరెక్టర్ కూడా.ఇక ఈసినిమా తరువాత ప్రదీప్ హీరోగా అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో నటించిన సినిమా డ్రాగన్.తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత శుక్రవారం థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.దాంతో రోజు రోజుకి కలెక్షన్లను పెంచుకుంటూ పోతుంది.మూడు రోజుల్లో ఈసినిమా తమిళనాడులో 24.9కోట్లు ,ఆంధ్రా &తెలంగాణ లో 6.25కోట్లు ,కర్ణాటక ,కేరళ ,నార్త్ లో కలిపి 4.37 కోట్లు ఓవర్సీస్ లో14. 7కోట్ల వసూళ్లను రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొత్తం మూడు రోజుల్లో 50.22 కోట్ల వసూళ్ల తో సెన్సేషనల్ హిట్ ను నమోదు చేసింది.
ఫుల్ రన్ లో ఈసినిమా 100 కోట్ల మార్క్ ను దాటనుంది.ప్రదీప్ రంగనాథన్ కు వరసగా ఇది రెండో 100కోట్ల సినిమా కానుంది.ఇంతకుముందు లవ్ టుడేతో ఈ ఫీట్ సాధించాడు.ఓవరాల్ గా ఈసినిమాతో ప్రదీప్ తమిళనాడులో స్టార్ హీరోల జాబితాలో జాయిన్ అయ్యాడు.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ ,కయాదు లోహర్ హీరోయిన్లు గా నటించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: