మొదటి రోజు బాలీవుడ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను బట్టి చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ పుష్ప 2 రెండో రోజు కూడా దుమ్ము దులిపింది.తొలి రోజు రికార్డు స్థాయిలో 72 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకోగా రెండో రోజు 59కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో రెండో రోజుల్లోనే 131 కోట్ల నెట్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఈరోజు, రేపు కూడా ఇదే రాంపేజ్ కొనసాగించనుంది.ఈ నాలుగు రోజుల్లోనే 250కో ట్లకుపైగా వసూళ్లను రాబట్టుకోనుంది.ఫుల్ రన్ లో ఒక్క హిందీ లోనే 500కోట్ల మార్క్ ను చేరుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పార్ట్ 1 పుష్ప కలెక్షన్స్ ను రెండో రోజుల్లో బీట్ చేసింది పుష్ప 2.మరి ఫుల్ రన్ లో బాహుబలి 2 రికార్డు ను క్రాస్ చేస్తుందో చూడాలి.బుక్ మై షో లో ఇప్పటికే 7 మిలియన్లకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి.ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదల కూడా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 హావ కొనసాగనుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటించిన ఈసినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయగా రష్మిక మందన్న కథానాయికగా నటించింది.రావు రమేష్, జగపతి బాబు ,జగదీష్ కీలక పాత్రల్లో కనిపించారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: