డబుల్ ఇస్మార్ట్ తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఉస్తాద్ రామ్ పోతినేని తన 22 వ సినిమాను స్టార్ట్ చేశాడు.ప్రస్తుతం హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.ఈచిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈసినిమా రామ్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కుతుంది.రీసెంట్ గా రామ్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేశారు.ఇందులో రామ్, సాగర్ అనే పాత్రలో డిఫ్రెంట్ లుక్ లో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో మరో హీరో కూడా ఉండనున్నారు.ఓ కీలక పాత్ర కోసం సీనియర్ హీరో ను తీసుకోవాలనుకుంటున్నారు.ఇందుకోసం పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు.అందులో భాగంగా మళయాలం స్టార్ మోహన్ లాల్ పేరుగా ఎక్కువగా వినిపిస్తుంది.త్వరలోనే ఈరోల్ లో నటించే హీరో ను ఫైనల్ చేయన్నునారు.తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ -మెర్విన్ సంగీతం అందింస్తుండగా సమ్మర్ లో ఈ సినిమాను తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈసినిమా విజయం రామ్ కు తప్పనిసరి కానుంది.రామ్ చివరి సినిమాలు తనకు కావాల్సిన విజయాన్ని అందించలేకపోయాయి.దాంతో రామ్ ఇప్పుడు చేస్తున్న సినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.మరి ఈసినిమాతో రామ్ ట్రాక్ లోకి వస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: