భారీ అంచనాల మధ్య నిన్న థియేటర్లలోకి వచ్చిన పుష్ప 2 వూహించనట్లుగానే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టి సరికొత్త రికార్డు ను నెలకొలిపింది. ప్రీమియర్స్ తోకలుపుకొని మొదటి రోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్ల మార్క్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.దాంతో హైయెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన మొదటి ఇండియన్ సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ తోపాటు ప్రీమియర్లు ,స్పెషల్ షో లు పడడం ఇతర భాషల్లో కూడా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో ఈ కలెక్షన్స్ సాధ్యమయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు కూడా బుకింగ్స్ బాగానే వున్నాయి.హాలిడే కాకుండానే మొదటి రోజు ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిందంటే హాలిడే అయితే 300కోట్ల మార్క్ ను దాటేసేది. అయితే పుష్ప 2 ముందు టార్గెట్ కూడా పెద్దగానే వుంది.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంటేనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయనుంది.
ఇదే జోరు కొనసాగిస్తే ఆ మార్క్ చేరుకోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.ఈవారాంతంలో ఈసినిమా 600 కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.ఇక ఈరోజుతో ఫస్ట్ పార్ట్ పుష్ప లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేయనుంది.అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటించిన ఈసినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: