అల్లు అర్జున్ పుష్ప 2 గ్లోబల్ వైడ్ గా సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంటుంది.మొదటి రోజు ఏకంగా 294కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది.దాంతో రెండు రోజుల్లో కలిపి ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 449కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఈరోజుతో 500కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది. ఈ వీకెండ్ కల్లా 600కోట్ల మార్క్ ను దాటనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగుతోపాటు హిందీ ,తమిళ భాషల్లో ఈసినిమా సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటుంది.రెండో రోజు తమిళనాడు లో సెన్సేషనల్ హోల్డ్ కొనసాగించింది. దాంతో రెండు రోజుల్లో అక్కడ 18కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో కలిపి 140కోట్ల మార్క్ ను దాటింది.హిందీ లో 131 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
అటు ఓవర్సీస్ లో కూడా పుష్ప 2 అదరగొడుతుంది.ఇప్పటివరకు అక్కడ 9 మిలియన్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.ఓవరాల్ గా పుష్ప 2 రెండో రోజు కూడా అన్ని ఏరియాల్లో ఎక్స్ లెంట్ హోల్డ్ ను కొనసాగించనుంది.ఈరోజు చాలా చోట్ల రెండో రోజు కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.ఇదే జోరు కొనసాగిస్తే ఫుల్ రన్ లో 1000కోట్ల మార్క్ ను దాటేయడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: