‘బలగం’ వంటి సంచలన బ్లాక్‌బస్టర్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’. ఈ చిత్రంతో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సరికొత్త అవతారంలో ప్రేక్షకులను పలకరించబోతుండటం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రానికి ఆయనే స్వయంగా సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ను విడుదల చేశారు. కథానాయకుడు, సంగీత దర్శకుడు అయిన దేవిశ్రీ ప్రసాద్ దేశంలోని విభిన్న సంస్కృతులు, ప్రాంతాలకు చెందిన ఏకంగా 100 మంది జానపద కళాకారులతో కలిసి ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్‌ను అత్యంత గ్రాండ్‌గా రికార్డ్ చేశారు. జానపద వాయిద్యాలు, సరికొత్త గాత్రంతో ఈ పాట నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది.
ఈ చిత్ర కథానాయిక వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫస్ట్ సింగిల్ అప్డేట్ త్వరలోనే రానుండగా, ఈ పల్లెటూరి స్వచ్ఛమైన భావోద్వేగాల కథాచిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. దేవి శ్రీ ప్రసాద్ హీరోగా చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























