మైసా ఫస్ట్ సింగిల్ డేట్ లాక్

Mysaa First Single Release Date Locked

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ . రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను అన్‌ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి నిర్మిస్తున్నారు. వచ్చే నెల నవంబర్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రయాణాన్ని ప్రారంభిస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌ను అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రం నుంచి ‘ఓ మైసారే’ అనే మొదటి పాటను నవంబర్ 2న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. రష్మిక డిఫరెంట్ అండ్ పవర్‌ఫుల్ అవతార్‌ను ప్రతిబింబించేలా ఈ పాట ఉండబోతోందని తెలుస్తోంది.

ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి స్వరాన్ని సమకూరుస్తున్నారు. సముద్రఖని, ఈశ్వరీ రావు, రాహుల్ రవీంద్రన్, ప్రవీణ్ దాచరం, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌పై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.