నాకు కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్‌ఫర్మ్ – నాని

Natural Star Nani Reveals Interesting Facts About Saripodhaa Sanivaaram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Natural Star Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movies,Nani Latest News,Nani Interview,Nani Latest Interview,Nani Exclusive Interview,Natural Star Nani Interview,SJ Suryah,Sokulapalem Special Interview Bbout Saripodhaa Sanivaraam,Saripodhaa Sanivaaram,Saripodhaa Sanivaaram Movie,Saripodhaa Sanivaaram Telugu Movie,Saripodhaa Sanivaaram Movie Updates,Saripodhaa Sanivaaram Movie Latest News,Natural Star Nani About Saripodhaa Sanivaaram Movie,Saripodhaa Sanivaaram Press Meet LIVE,Priyanka Mohan,Saripodhaa Sanivaaram Q&A Press Meet Live,Vivek Athreya,Priyanka,Saripodhaa Sanivaaram Press Meet,Nani Reveals Facts About Saripodhaa Sanivaaram

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్‌జే. సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మూవీ యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.

ఇక ఈ ప్రెస్‌మీట్‌లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మనం మధ్యలో ఒక ప్రామిస్, ఒక బాండ్ వుంది. ఈ బాండ్‌ని ఇంకా ఇంకా బలపరిచే సినిమా ‘సరిపోదా శనివారం’ అవుతుంది. ఈసారి సినిమా హాళ్ళు కాన్సర్ట్‌లా వుంటుంది. జేక్స్ బిజోయ్ చితకొట్టేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు మీరు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. మీతో పాటు చూడటానికి ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సుదర్శన్ 35 ఎంఎంకి మార్నింగ్ 11 షోకి వస్తున్నాను. కలసి సెలబ్రేట్ చేసుకుందాం. వివేక్ ఆ రోజే వస్తాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయి వున్నాడు. దానయ్య గారు ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సక్సెస్ చూసిన తర్వాత అంత తొందరగా ఏదీ ఆనదు. కానీ ఇది ఆనుతుందనే నమ్మకం వుంది (నవ్వుతూ). కళ్యాణ్‌కి థాంక్స్. టీం అందరికీ పేరుపేరునా థాంక్స్. సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు” అని తెలిపారు.

“వివేక్ రెండు నెలలుగా నిద్రపోయింది లేదు. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది. ఈసారి వాళ్ళందరి కోసం ఈసారి సినిమా వేరే లెవల్‌కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రీరిలీజ్ ఈవెంట్ 24న జరగబోతోంది. టీం అందరితో కలసి ఆ రోజు సెలబ్రేట్ చేసుకుందాం. ఆగస్ట్ 29న థియేటర్స్‌లో కలుద్దాం. నాకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్‌ఫర్మ్ అవ్వాల్సిందే. (నవ్వుతూ)” అని అన్నారు హీరో నాని.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.