గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్ ‘మగధీర’లో విలన్ పాత్రలో మెరిసిన ఉత్తరాది నటుడు దేవ్ గిల్ గుర్తుండేవుంటాడు. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో అనంతరం పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి మెప్పించాడు. అయితే దేవ్ గిల్ ప్రస్తుతం హీరోగా ‘అహో! విక్రమార్క’ అనే సినిమా చేస్తున్నాడు. ఆయన హోం బ్యానర్ దేవ్ గిల్ ప్రొడక్షన్స్ పై రూపొందుతోన్న ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో సాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్ 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ అహో! విక్రమార్క సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. మహారాష్ట్ర పోలీసుల ధైర్యాన్ని మరియు అంకితభావాన్ని ప్రభావవంతంగా ప్రదర్శించడమే లక్ష్యంగా ఈ సినిమా తెరకెక్కించినట్టు ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.
ఇక ట్రైలర్‌ను గమనిస్తే.. అసుర అనే విలన్ ఓ ప్రాంతాన్ని తన కంట్రోల్‌లో పెట్టుకుని ఉంటాడు. అక్కడి ప్రజలు అతను చెప్పింది వినాల్సిందే. లేకుంటే వారికి చావే గతి. అలాంటి వాడిని ఎదిరించటానికి పోలీసులకే గుండె ధైర్యం ఉండదు. కానీ చెడుని అంత మొందించటానికి మంచి ఏదో ఒక రూపంలో వస్తుంది. అలాంటి అసురుడిని అంతమొందించటానికి ఆ ప్రాంతంలోకి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. తనేం చేశాడు.. ఎలా విలన్స్ భరతం పట్టాడు.. అనేది తెలుసుకోవాలంటే ఆగస్ట్ 30న విడుదలవుతున్న సినిమా చూడాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: