నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా హైదరాబాద్ లోని సుదర్శన్ 35 MM థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ గ్రిప్పింగ్ ట్రైలర్ అదిరిపోయే నెరేటివ్‌తో మొదటి నుండి చివరి వరకు ఆడియన్స్‌ని కట్టిపడేసి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది. సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 24(శనివారం)న ఈ వేడుకను నిర్వహించనున్నట్టు మేకర్స్ వెల్లడించారు.
ఇక ఈ పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ను డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా.. మురళి జి సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనుంది. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: