టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో వీరి కాంబోలోనే వచ్చి సూపర్ హిట్ అయిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా ఇది రూపొందింది. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలీ, షాయాజీ షిండే, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‍తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించిన డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో వరంగల్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ.. “హాయ్ ఎవ్రీ వన్. మీ ఊరు రాకుండా, మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ అవ్వవ్. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. డబుల్ ఇస్మార్ట్ గురించి మాట్లాడాలంటే ఒకే ఒక పేరు.. రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్.. రామ్ పోతినేని ఎనర్జీ. రామ్ ని సెట్స్ లో చూసిననప్పుడు తనలో కసి కనిపిస్తుంటుంది, అది నన్ను చాలా ఎక్సయిట్ చేస్తుంది. తన క్యారెక్టర్, హెయిర్ స్టయిల్, నడక, స్లాంగ్.. ఇవన్నీ తను పెర్ఫార్మ్ చేయడం వలనే అవుతుంది. తను వెరీ గుడ్ యాక్టర్, డ్యాన్సర్. రామ్ పోతినేని లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. రామ్ డబుల్ ఎనర్జీతో ఈ సినిమా చేశాడు. ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తారు. థాంక్ యూ రామ్” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సంజు బాబా(సంజయ్ దత్)కి నేను పెద్ద ఫ్యాన్ ని. 150 సినిమాల హీరో ఆయన. ఆయన ఈ సినిమాలో చేయడం కొత్త కలర్ తీసుకొచ్చింది. కావ్య చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. రామ్ పక్కన అద్భుతంగా డ్యాన్స్ చేసింది. తెలుగులో నేర్చుకొని డబ్బింగ్ చెప్పింది. అలీ గారి గురించి ఎక్కువ చెప్పను. ఇందులో అలీ గారి ట్రాక్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో పని చేసిన యాక్టర్స్ కి, టెక్నిషియన్స్ కి థాంక్స్. ఛార్మి కౌర్ మా కంపెనీ స్ట్రెంత్. ఏదైనా పని చెబితే చేసుకొస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఫిలిం మేకింగ్ లో చాలా హార్డ్ టైమ్స్ వుంటాయి. అన్నీట్లో తను నిల్చుంది. ఆగస్ట్ 15 సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వెళ్లి చూడండి. రామ్ పోతినేని మిమ్మల్ని ఎంటర్ టైనర్ చేయడానికి రెడీగా వున్నారు” అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: