డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అభిమానులతో ఒక ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్నారు. ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి నుంచి తనకు ఒక ఫోన్ వచ్చిందని, దీని తర్వాత తాను చాలా ఎమోషనల్ అయ్యానని ఆయన తెలియజేసారు. వివరాల్లోకి వెళ్తే.. ఉస్తాద్ రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో వరంగల్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ.. “మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. విజయేంద్ర ప్రసాద్ గారు ఒకసారి ఫోన్ చేశారు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీస్తున్నారు, తీసే ముందు కథ చెప్తారా అని అడిగారు. మీలాంటి డైరెక్టర్స్ ఫెయిల్ అవ్వడం నేను చూడలేను, చిన్న చిన్న తప్పులు ఎవైనా చేస్తుంటారు తీసే ముందు ఒకసారి చెప్పండని అన్నారు. ఆ ఒక్క ఫోన్ కాల్ తో చాలా ఎమోషనల్ అయిపోయాను. నామీద ఆయనకి వున్న ప్రేమ అభిమానంతో చేశారు. అయితే తర్వాత ఆయనకి కథ చెప్పలేదు. మనకి తెలిసిన పనే కదా కాస్త వొళ్ళు దగ్గరపెట్టుకొని తీసి ఆయన్ని కలుద్దామని చెప్పలేదు (నవ్వుతూ), లవ్ యూ సర్” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: