ఈ మూవీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే.. నిహారిక కొణిదెల

Niharika Konidela Strong Counter To Negative Reviews on Committee Kurrollu

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. య‌దు వంశీ ద‌ర్శ‌కత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 9న విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తొలిరోజే రూ.1.63 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్రాన్ని అద్భుతంగా ఆదరిస్తూ, ఇంతటి భారీ విజయాన్ని కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ శనివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. చిత్ర యూనిట్ అందరూ హాజరైన ఈ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత నిహారిక కొణిదెల నెగటివ్ రివ్యూలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. ‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. మా చిత్రాన్ని రమేష్ గారు భుజానికెత్తుకుని నడిపించారు. పెట్టిన ప్రతీపైసా తెరపై కనిపిస్తుందని అంతా అంటున్నారు. వంశీ గారు మా అందరినీ నమ్మి సినిమాను రిలీజ్ చేసినందుకు థాంక్స్. అంకిత్ కొయ్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. కథ వినమని అన్నాడు. వంశీ కథను వినాలని తీసుకున్నదే ది బెస్ట్ నిర్ణయం” అని పేర్కొన్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “నాకంటే ఎక్కువగా అంకిత్, రమేష్ గారు ఈ కథను నమ్మారు. మాతో పాటు సపోర్ట్‌గా నిలిచిన అంకిత్‌కు థాంక్స్. మంచి చిత్రాన్ని తీస్తే సరిపోదు. అది జనాల వరకు వెళ్లాలి. అలా జనాల వరకు తీసుకెళ్లిన మీడియాకు థాంక్స్. ఇది పీపుల్స్ సినిమా అయింది. ఈ మూవీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే జనాలే కౌంటర్లు ఇస్తున్నారు. ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు మా అందరికీ గర్వంగా ఉంది” అని అన్నారు.

కాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో 11మంది కొత్తవారు నటించడం విశేషం. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.