డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ ఇద్దరికీ మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా 2019 లో వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈసినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ కావడంతో మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, మూడు పాటలను రిలీజ్ చేయగా అప్ డేట్లు అన్నీ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ 4వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు మరో అప్ డేట్ ఇచ్చారు. ట్రైలర్ లాంట్ ఈవెంట్ వేదికను ఖరారు చేస్తూ తెలియచేశారు. వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్ని ఇప్పటికే సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. టీజర్, వరుసగా వస్తున్న పాటలు అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ట్రైలర్ ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. కాగా ఈసినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కే నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: