ఈఏడాది ప్రారంభంలో అయలాన్ తో వచ్చిన తమిళ హీరో శివ కార్తికేయన్ రీసెంట్ గా అమరన్ సినిమాను కంప్లీట్ చేశాడు. ఇందులో అతను ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్న ఈసినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు.సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుందని తమిళ మీడియా వెల్లడించింది.త్వరలోనే ఈ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.అమరన్ తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదలకానుంది. అయితే ఇక్కడ మాత్రం గట్టి పోటీ ఎదురుకానుంది.అదే రోజు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ రిలీజ్ కానుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఎక్కువ థియేటర్లలో విడుదలకానుంది.దాంతో అమరన్ కు పోటీ తప్పకపోవచ్చు.అమరన్ ను కమల్ హాసన్ సొంతం బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.
ఇక శివ కార్తికేయన్,మురగదాస్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.ఇందులో కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది ఈసినిమా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























