తెలుగులోనే కాదు నేషన్ వైడ్ గా భారీ అంచనాలున్న సినిమా పుష్ప 2. ఫస్ట్ పార్ట్ పుష్ప నార్త్ లో 100కోట్లకు పైగా రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.దాంతో సీక్వెల్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. రీసెంట్ గా రిలీజైనా రెండు పాటలకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పుష్ప 2 ఆగస్టు 15న విడుదలకానుందని తెలిసిందే. తెలుగులో అయితే ఈసినిమాకు పోటీ గా మరో సినిమాను దించే సాహసం చేయడం లేదు అయితే హిందీ లో మాత్రం ఓ సినిమా ఎదురు వెళ్తుంది అదే వేదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జాన్ అబ్రహం నటిస్తున్న ఈసినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని ఈరోజు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దాంతో పుష్ప 2 తో వేదా డీ కొట్టనుంది.మరి ఈసినిమా ,పుష్ప 2 పోటీని ఎంత వరకు తట్టుకుంటుందో చూడాలి. నిఖిల్ అద్వానీ తెరకెక్కిస్తున్న వేదా లో షర్వారి,అభిషేక్ బెనర్జీ ,తమన్నా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఇక పుష్ప 2 షూటింగ్ విషయానికి వస్తే రిలీజ్ డేట్ ను అందుకోవాలని సుకుమార్ బ్రేక్ లేకుండా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఓ కీలకమైన షెడ్యూల్ జరుగుతుంది. జూలై రెండో వారానికి కల్లా సినిమాను పూర్తి చేయాలనీ పట్టుదలతోవుంది టీం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























