గేమ్ ఛేంజర్ ఫైనల్ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ ఈ రోజు సాయంత్రం రాజమండ్రి చేరుకున్నాడు. దాదాపు వారం రోజులపాటు అక్కడ ఈ షెడ్యూల్ జరుగనుంది. దీంతో రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కానుంది.ఈ షెడ్యూల్ తరువాత ఇంకో లాంగ్ షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండనుంది. అందులో మిగితా నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఆ షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ కానుంది.సెప్టెంబర్ లోపు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి అక్టోబర్ లేదా డిసెంబర్ లో సినిమాను విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మెసేజ్ తో శంకర్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో కియరా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా శ్రీకాంత్, శ్యామ్, సునీల్,ఎస్ జె సూర్య,అంజలి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక రామ్ చరణ్, గేమ్ ఛేంజర్ కంప్లీట్ చేసి తన 16వ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన ఈసినిమా డైరెక్ట్ చేయనుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది.జూలై లేదా ఆగస్టు లో సెట్స్ మీదకు వెళ్లేలావుంది. మైత్రి మూవీ మేకర్స్ ,వృద్ధి సినిమాస్ నిర్మించనున్నాయి. ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: