వార్ 2 సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడో చెప్పిన హృతిక్ రోషన్

Hrithik Roshan Gives Hint as War 2 Movie Will Go on Floors Very Very Soon

యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన తన తదుపరి సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన తాజాగా నటిస్తోన్న ‘దేవర’ చిత్రాన్ని దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో భారీగా విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఈ మూవీతో బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్దమైన జూ. ఎన్టీఆర్.. అందుకు తగ్గట్లే అక్కడి భామ జాన్వీ కపూర్‌ని కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇదిలా ఉండగా.. దేవర తర్వాత ఎన్టీఆర్‌ వరుసగా పలు సినిమాలను లైనప్‌లో పెడుతున్నారు. దీనిలో భాగంగా.. ‘కేజీఎఫ్’, ‘సలార్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అలాగే అంతకంటే ముందు ఆయన ‘వార్ 2’ అనే బాలీవుడ్ మూవీలో నటించనున్నారు. ఇందులో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి తారక్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు.

ఈ నేపథ్యంలో ఇటు టాలీవుడ్ సహా అటు బాలీవుడ్ లోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు నటించనుండటంతో అభిమానులు కూడా దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘వార్ 2’ చిత్రం గురించి హీరో హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. అతి త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా మరికొన్ని రోజుల్లోనే ‘వార్ 2’ షూటింగ్ ప్రారంభం కానుందని ఆయన కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 3 =