డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా ఎంత ఘన విజయం సాధించిందో చూశాం. పూరీ డైలాగ్స్ కు రామ్ నటన తోడవ్వడం దానికిి తోడు మ్యూజిక్ కూడా కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో ఈసినిమాకు సీక్వెల్ రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. మార్చి8వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా క్లైమాక్స్ ను భారీగా ఇంట్రెస్టింగ్ గా అలానే విజువల్ వండర్ గా ఉండేలా తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ క్లైమాక్స్ ఫైట్స్ ను చిత్రీకరిస్తారట. ఫైట్ సీక్వెన్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయని అంటున్నారు.
కాగా ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా ఈసినిమా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: