ప్రైమ్ లోకి రానున్న జైలర్ 2 … స్ట్రీమింగ్ ఎప్పుడంటే

Jailer 2 Set for OTT Release on Prime Video

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన భారీ సీక్వెల్ చిత్రం ‘జైలర్ 2’ ఓటీటీ విడుదలకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడింది. ఈ చిత్రాన్ని నవంబర్ 12 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో అలరించారు. మోహన్‌లాల్, మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, ఎస్‌జే సూర్య, రమ్యకృష్ణ, సూరజ్ వెంజారమూడు, యోగి బాబు కీలక పాత్రల్లో నటించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

గత నెల 15న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి, కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఇక థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ‘టైగర్ ముత్తువేల్ పాండ్యన్ ఈజ్ బ్యాక్’ అంటూ నవంబర్ 12 నుంచి ప్రైమ్ వీడియో వేదికగా డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.