సంక్రాంతి కింగ్ నాగార్జున గారు, ఆయనతో కలసి నటించడానికి ఎప్పుడూ సిద్ధమే – అల్లరి నరేష్

Allari Naresh Says, He is Ready To Act with Nagarjuna Akkineni Any Time

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని హీరోగా నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించగా.. పవన్ కుమార్ సమర్పించారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటించగా.. టాలీవుడ్ యువ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ మరియు నటీమణులు మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. నా సామిరంగ చిత్రానికి డీవోపీగా పనిచేసిన శివ సంక్రాంతి అల్లుడు. ఈ సంక్రాంతి పండుగకు ఆయన పనిచేసిన రెండు సినిమాలు.. ‘హనుమాన్’, ‘నా సామిరంగ’తో విజయాలు అందుకున్నాడు. చోటా ప్రసాద్ గారితో వర్క్ చేయడం మంచి అనుభూతి. కీరవాణి గారు, చంద్రబోస్ గారిది విడదీయరాని బంధం. ఎప్పుడూ ఇలానే ఉంటూ మరింత మంచి సంగీతం అందించాలని కోరుకుంటున్నాను. వారు ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. టీం అందరికీ థాంక్స్. విజయ్ బిన్నీ గారు సక్సెస్ అందుకోవడం చాలా అనందంగా వుంది. అషికా అద్భుతంగా నటించింది. వరాలు లాంటి కష్టమైన పాత్రని అవలీలగా చేశారు. సంక్రాంతి కింగ్ నాగార్జున గారు. ఆయనకి ఒక ఫ్యాన్ బాయ్ స్టేజ్ నుంచి..ఇప్పుడు కో స్టార్‌గా ఆయనతో స్క్రీన్‌ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. నాగార్జున గారితో కలసి నటించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా వుంటాను” అని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + one =