హనుమాన్ హిందీలో 50కోట్ల క్లబ్ కి చేరువగా వెళుతుంది.గురువారం 78లక్షల నెట్ ను సొంతం చేసుకున్న ఈసినిమా నిన్న మళ్ళీ పుంజుకుంది.రిపబ్లిక్ డే సందర్భంగా హాలిడే కావడంతో 1.85కోట్ల నెట్ వసూళ్లను దక్కించుకుంది దాంతో 15రోజుల్లో హిందీలో 41.44కోట్ల నెట్ ను రాబట్టింది.ఫుల్ రన్ లో 50కోట్లు సాధ్యమయ్యేలానే వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకి బాక్సాఫీస్ వద్ద ఫైటర్ రూపంలో గట్టి పోటీఎదురవుతుంది.స్క్రీన్స్ తగ్గించడం అలాగే ఫైటర్ కు పాజిటివ్ టాక్ రావడం తో హనుమాన్ కలెక్షన్ల పై ప్రభావం పడుతుంది.అయితే లిమిటెడ్ స్క్రీన్స్ లోకూడా ఈరేంజ్ వసూళ్లు మామలు విషయం కాదనే చెప్పాలి.
ఇదిలావుంటే గ్లోబల్ వైడ్ గా హనుమాన్ దుమ్మురేపుతుంది.నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 250కోట్ల మార్క్ ను టచ్ చేసింది.కేవలం 20కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా బయ్యర్లకు ఊహించని లాభాలు తీసుకొస్తుంది.ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసినా ఈసినిమాలో తేజ సజ్జా హీరోగా నటించగా అతనికి జోడీగా అమృత అయ్యర్ కనిపించింది.వరలక్ష్మి శరత్ కుమార్,సముధ్రఖని కీలక పాత్రల్లో నటించారు.నిరంజన్ రెడ్డి ఈసినిమాను నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: