టాలీవుడ్ మ్యాచో అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతోో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తో గోపీచంద్ తన తన కొత్త సినిమాను చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టి కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకున్నారు. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా కొత్త షెడ్యూల్ ను హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన హిమాలయాల్లో ప్రారంభించినట్టు తెలిపారు. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా శ్రీనువైట్ల ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన గోపీ మోహన్ ఈసినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. చైతన్య భరద్వాజ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా.. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దొనెపూడి ఈసినిమాను నిర్మిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో నటించే ఫీమేల్ లీడ్ ఇతర నటీనటుల గురించి త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: