సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా పుష్ప. ఈసినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు పుష్ప. ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అల్లు అర్జున్ కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ సంచలన విజయం వల్ల ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేశాయి అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా ఈసినిమా గ్లింప్స్. వీటికి వచ్చిన రెస్పాన్స్ తో పార్ట్ 2 కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమాను ఏప్రిల్ 15వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు సినిమా ప్రారంభించినప్పుడే ప్రకటించేశారు. ఆదిశగానే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈసినిమా రిలీజ్ డేట్ పై పలు వార్తలు తెరపైకి వస్తున్నాయి. దానికి కారణం దేవర మూవీ. దేవర మూవీ ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. కానీ ఇప్పుడు ఈసినిమా రిలీజ్ వాయిదా పడుతుందన్న కథనాలు అయితే మొదలయ్యాయి. దానికి తోడు సైఫ్ కు గాయాలవ్వడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇదిలా ఉండగా ఇప్పుడు పుష్ప2 సినిమా కూడా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందన్న వార్తలు మొదలయ్యాయి. ఇక ఈ వార్తలకు సాలిడ్ రిప్లై ఇచ్చారు మేకర్స్. తమ ట్విట్టర్ ద్వారా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ను కోట్ చేస్తూ.. ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరగతుండాది పుష్ప గాడి రూల్ ఉంటా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మార్చేది లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
𝟏𝟓 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟐𝟎𝟐𝟒 💥 #Pushpa2TheRule https://t.co/pUfgqlTvpZ pic.twitter.com/r7V3oLdXto
— Pushpa (@PushpaMovie) January 26, 2024
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: