వ్యూహం ట్రైలర్ 2 రిలీజ్

RGV Vyooham Movie second trailer out now

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ “వ్యూహం” సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. ఇక ఇన్ని రోజులు సెన్సార్ అడ్డంకులు ఎదుర్కొన్న ఈసినిమాకు ఇప్పుడు ఆ సమస్య కూడా దాటిపోయింది. ఈసినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. ఇక ఈసినిమా ఈ నెల 29న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈనేపథ్యంలో నేడు ఈసినిమా నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – సెన్సార్ అడ్డంకులతో మా వ్యూహం సినిమా ఆగిపోయినప్పుడే చెప్పాను. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్లే..మా సినిమా థియేటర్స్ లోకి రావడాన్నీ అడ్డుకోలేరని. ఇవాళ అదే జరిగింది. అందుకే ఫస్ట్ టైమ్ సెన్సార్ సర్టిఫికెట్ తో పోస్టర్ డిజైన్ చేయించాం. ఈ నెల 29న గ్రాండ్ గా వ్యూహం సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఇందులో రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పాత్రలను పోలిన క్యారెక్టర్స్ ఉంటాయి. అయితే వాటికి చంద్రబాబు, పవన్ రియల్ లైఫ్ కు సంబంధం లేదు. ఈ వ్యూహం కథలో వైఎస్ రాజ శేఖర రెడ్డి మరణం నుండి మొదలై జగన్ అరెస్ట్, ఆయన పార్టీ పెట్టి సీఎం అవడం, వైఎస్ వివేక హత్య వంటి అనేక ముఖ్య సంఘటనలు ఉంటాయి. సినిమా అంటే డ్రామా కాబట్టి ఆ ఘటనలన్నీ డ్రమటిక్ గా సినిమా చూసే ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాను. సలార్ తో మా సినిమాకు పోటీ ఉండదు. రెండు వేర్వేరు జానర్ మూవీస్. ఏ సినిమా చూసే ఆడియెన్స్ ఆ సినిమాకు సెపరేట్ గా ఉంటారు. ఈ కథలోని అంశాలు ప్రజలందరికీ తెలిసిన విషయాలు కావు. ఇన్ సైడ్ జరిగిన విషయాలు. అలాంటి అంశాలు ఈ సినిమాలో చూపిస్తున్నాం. పవన్ కల్యాణ్ జనసేన పెట్టినప్పుడు ప్రసంగం విన్నాను. ఆ తర్వాత పవన్ స్టెప్స్ చూస్తే…ఆయన రాజకీయ ప్రయాణంలో స్థిరత్వం లేదనిపించింది. ఏ విషయాన్నైనా ఎవరికి వారు వారి కోణంలో అర్థం చేసుకుంటారు. వ్యూహం నాకు అర్థమైన కోణంలో రూపొందించిన సినిమా. వ్యూహంలో మీకున్న డౌట్స్ నా రాబోయో మూవీ శపథం చూస్తే క్లియర్ అవుతాయి. నేను రాజకీయాల్లో లేకున్నా ఆ పొజిషన్స్ లో ఉన్న వారు ఎలా ప్రవర్తిస్తారు అనే ఐడియా ఉంది. తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి డైనమిక్ గా వ్యవహరించారు. ఆయన ఒక స్ట్రాంగ్ అపోజిషన్ గా నిలబడటం వల్లే ఇవాళ కాంగ్రెస్ గెలిచింది. ఏపీలో తెలంగాణలో ఉన్నంత స్ట్రాంగ్ అపోజిషన్ పాత్రను చంద్రబాబు పోషించలేకపోతున్నారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా నేను చేసినన్ని వెరైటీ మూవీస్ మరొకరు చేసి ఉండరు. వాటిలో బయోపిక్స్ ఐదారు వరకు ఉంటాయి. పాపులర్ పర్సన్ మీద సినిమా చేసినప్పుడు మీడియా అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగతంగా నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు. అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + nine =