ఈమధ్య తన రూట్ ను మార్చి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డెవిల్. పీరియాడిక్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ స్పై పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మాయే చేసి అనే పాటను అలానే దిస్ ఈజ్ లేడీ రోజ్ అనే పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయనున్నారు. దూరమే తీరమని అనే సోల్ ఫుల్ మెలోడీని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటంచారు. ఈపాట ప్రోమోను రేపు అంటే డిసెంబర్16 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Get ready to be swept away by the soulful melody of #DhoorameTheeramai from #DevilTheMovie.
Promo drops tomorrow! 🎶❤️#DevilOnDec29th #Devil – The British Secret Agent@NANDAMURIKALYAN @iamsamyuktha_ #MalvikaNair
Directed & Produced by #AbhishekNama@vasupotini @soundar16… pic.twitter.com/VYodMkSs86— ABHISHEK PICTURES (@AbhishekPicture) December 15, 2023
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: