కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రాబోతున్న సినిమా ఈగల్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటంది. ఇక ఈసినిమాను 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ ఆడు మచ్చా అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈపాటను డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఆడు మచ్చా.. ఆడు మచ్చా.. అగడి.. బడగి ఆడు” అంటూ వచ్చే ఈ సాంగ్ప్రోమో అయితే ఎనర్జిటిక్ గా ఉంది. రవితేజ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో .. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో కనిపిస్తున్నాడు. రాహుల్ సిప్లిగంజ్ ఈ సాంగ్ ను పాడాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#AaduMacha 🔥🕺 🕺🔥
Song Promo : https://t.co/sxBdskAUlI
Full Song from Dec 5th @ 6:03 PM! #Eagle #EAGLEonJan13th pic.twitter.com/MalxbQg1Uq
— People Media Factory (@peoplemediafcy) December 4, 2023
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: