న్యాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వస్తున్న సినిమా హాయ్ నాన్న. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తండ్రి-కూతరు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాతో పాటు లవ్ స్టోరీని జోడించి ఈసినిమాను తెరకెక్కించారు. అందుకే ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకూ రిలీజ్ అయిన పాటలు ఒక్కో జోనర్ లో ఉన్నాయి. తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ఓడియమ్మ అంటూ వచ్చే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట మంచి పార్టీ వైబ్స్ తో ఉంది. పాట అయితే పార్టీ మోడ్ లో ఉండి ఆకట్టుకుంటుంది.
Feel high…Feel this high 🔥
Feel the vibes with #Odiyamma from #HiNanna now ❤️🔥
Magical voices by #DhruvVikram & @shrutihaasan 🎙️
– https://t.co/X0sBHcFFRA#HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic… pic.twitter.com/Oq63BKy16l
— Vyra Entertainments (@VyraEnts) November 28, 2023
ఇక ఈసినిమాలో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































