బిగ్ బాస్ సీజన్ 7.. 11 వారాలు పూర్తిచేసుకొని 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఎలిమినేషన్లో లాస్ట్ కి గౌతమ్, అశ్విని ఉండగా.. ఫైనల్ గా ఈ వీక్ ఎలిమినేషన్ లేకపోవడంతో హౌస్ మేట్స్ కు ఊరట లభించింది. దాంతో ఆదివారం ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక అక్కడి నుండే సోమవారం ఎపిసోడ్ మొదలవుతుది. ఎపిసోడ్ స్టార్టింగ్ గౌతమ్, అశ్విని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఎలిమినేట్ అయితే బయటకు వెళ్లి ఏం చేయాలా అని ఆలోచించానంటూ చెప్పుకుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆతరువాత అందరూ ఎదురుచూసే నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టేశాడు బిగ్ బాస్. నామినేషన్ ప్రాసెస్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే ముందుగా అమర్ దీప్ వచ్చి యావర్ నామినేట్ చేస్తూ ఎవిక్షన్ పాస్ కు ఆడే టాస్కుల్లో ఫౌల్ గేమ్ ఆడావని.. బాల్స్ గేమ్ లో కాలు కింద పెట్టావని చెబుతాడు. అందుకు యావర్ కూడా అందుకే ఎవిక్షన్ పాస్ ను తిరిగి ఇచ్చేశానని.. సంచాలకుడిగా నువ్వు చూడాలి.. నువ్వు కూడా సరిగా ఆడలేదు అంటూ అమర్ కు కౌంటర్ ఇచ్చాడు. దానికి అమర్ కూడా అయితే నామినేట్ చేసుకో అంటాడు. ఆ తరువాత అమర్ సెకండ్ నామినేషన్ ను రతికకు వేస్తూ.. కెప్టెన్సీ టాస్క్ లో తనను టార్గెట్ చేయడం నచ్చలేదంటూ రీజన్ చెబుతాడు.
అనంతరం గౌతమ్ వచ్చి ప్రశాంత్ ను, శివాజీ ని నామినేట్ చేస్తాడు. బాల్స్ బ్యాలెన్స్ చేసే గేమ్ లో సంచాలకుడిగా ఫెయిల్ అయ్యావని ప్రశాంత్ కు రీజన్ చెబుతాడు గౌతమ్. శివాజీ ని నామినేట్ చేస్తూ బాల్స్ బ్యాలెన్స్ చేసే గేమ్ లో మీరు ఎక్కువ ఫౌల్స్ చేసారని అనగా .. దానికి శివాజీ నువ్వెవడివి చెప్పడానికి అంటూ సీరియస్ అవుతాడు. ఆ తరువాత రతిక వచ్చి అమర్ దీప్ ను ప్రశాంత్ ను నామినేట్ చేస్తుంది. అర్జున్ శివాజీని, యావర్ ను.. ప్రశాంత్ గౌతమ్ , రతికను నామినేట్ చేశారు. ఇక్కడ గౌతమ్ కు ప్రశాంత్ కు మధ్య పెద్ద గొడవనే జరుగుతుంది.
అశ్విని వచ్చి తన దగ్గర రీజన్స్ లేవని.. సిల్లీ రీజన్స్ చెప్పి ఎవరినీ నామినేట్ చేయలేనని చెప్పుకొచ్చింది. దాంతో ఎవరి పేర్లూ చెప్పకపోతే సెల్ఫ్ నామినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పడంతో అందుకు ఒప్పుకుంటూ సెల్ఫ్ నామినేషన్ వేసుకుంటుంది అశ్విని. దాంతో సోమవారం ఎపిసోడ్ ముగుస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: