నా ఫేవరెట్ ఎన్టీఆర్- జపాన్ మినిస్టర్ కామెంట్స్

japanese foreign minister yoshimasa hayashi interesting comments

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తారో తెలియంది కాదు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ అవ్వగా.. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గణించాడు. ఈసినిమా పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాతో అటు ఎన్టీఆర్ కానీ ఇటు చరణ్ కానీ అంతర్జాతీయంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక ఇద్దరిలో ఎవరకి వారు సెపరేట్ గా ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఈమధ్య అంతర్జాతీయ నటీనటులు కానీ డైరెక్టర్లు కానీ ఎన్టీఆర్, చరణల నటనను ప్రశంసించడమే కాకుండా వారితో సినిమా చేయలని ఉంది అని కూడా బహిరంగంగా చెబుతున్నారు. ఇక ఇప్పుడు మరోసారి విదేశాల్లో మన హీరోల సత్తా ఏంటో రుజువైంది.

తాజాగా జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఇక అక్కడ ఆయన తాను కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను చూశానని.. చరణ్, ఎన్టీఆర్ బాగా నటించారు.. అయితే నా ఫేవరెట్ ఎన్టీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. ఈనేపథ్యంలో ఓ విదేశీ విదేశాంగ మంత్రి మన హీరోల గురించి ప్రస్తావించడం అంటే గొప్ప విషయం అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక ఎన్టీఆర్ అభిమానులు అయితే ఈవీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 10 =