టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మూవీ లవర్స్ కు మంచి సినిమా అందించేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీగా ఉంటాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగబలి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. జులై 7వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కామెడీ, యాక్షన్ సీన్స్ తో టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. అంతేకాదు గోపరాజు రమణ, బ్రహ్మాజీ, సప్తగిరి, సత్య కామెడీ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచేలా కనిపిస్తోంది. మన ఊళ్లో మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ నాగశౌర్య చెప్పిన డైలాగ్ టీజర్ కు హైలెట్ గా నిలుస్తుంది. ఈ సినిమాలో దసరా సినిమాలో విలన్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న షైన్ టామ్ చాకో విలన్ గా కనిపిస్తున్నాడు.
Unveiling a teaser of #Rangabali❤️🔥
Hope you all like it♥️🥳#Rangabali Teaser out now!In cinemas on July 7th 💥💥
#YuktiThareja @PawanBasamsetti @pawanch19 @DivakarManiDOP #KarthikaSrinivas #ASPrakash @SLVCinemasOffl @saregamasouth pic.twitter.com/ZCNnxjth54— Naga Shaurya (@IamNagashaurya) June 8, 2023
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా యుక్తి తరేజా నటిస్తుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ సీహెచ్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దివాకర్ మణి పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: