ఆదిపురుష్- 10 వేల టికెట్స్ బుక్ చేసిన రణ్ బీర్

ranbir kapoor to book 10 thousand tickets for underprivileged children

ఓ రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. అయితే రామయణంలోనే అరణ్యకాండ, యుద్ద కాండ ను మెయిన్ థీమ్ గా తీసుకొని ఈసినిమాను రూపొందించాడు ప్రభాస్. ఈసినిమా జూన్ 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా విడుదల దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతంచేసుకొని సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాకు సంబంధించి రోజుకో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ అందించడమే కాకుండా సినిమాపై ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం చోటుచేసుకుంది. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ఈసినిమా 10 వేల టికెట్లను బుక్ చేసుకున్నాడు. పేద పిల్లల కోసం ఈ టికెట్లను కొనుగోలు చేశాడట రణ్ బీర్ కపూర్. మరి ఈసినిమా రిలీజ్ అయ్యే లోపు ఇంకెన్ని విశేషాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా సంస్థ ఈసినిమా హక్కులు సొంతం చేసుకోగా.. నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + twelve =