మహావీరుడు డబ్బింగ్ కంప్లీట్ చేసిన కార్తికేయన్

siva karthikeyan completes dubbing for Maaveeran movie

తమిళ్ టాలెంటెడ్ నటుడు శివకార్తికేయన్ తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నుండి వస్తున్న సినిమా మహావీరుడు. మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. తమిళ్ లో మావిరన్ అనే టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో మహావీరుడు అనే టైటిల్ తో వస్తుంది. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసే పనిలో ఉంది. రీసెంట్ గానే శివ కార్తికేయన్ ఈసినిమా డబ్బింగ్ ను ప్రారంభించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. శివకార్తికేయన్ తన డబ్బింగ్ ను పూర్తి చేసినట్టు మేకర్స్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో శివ కార్తికేయన్‌ కు జోడిగా అదితి శంకర్ నటిస్తోంది. ఈసినిమాను శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తుండగా భరత్ శంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కుమార్ గంగప్పన్ ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమా జూలై 14, 2023న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =