ఇరుముడి అంటే ఇద్దరికి పడిన ముడి – శివ నిర్వాణ

Director Siva Nirvana’s Speech at the Irumudi Trailer Launch Event

మాస్ మహారాజా రవి తేజ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలను పెరుగుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్ పాటలతో ఇప్పటికే చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు చిత్ర నిర్మాతలు తెలుగు, తమిళ భాషలలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భీమవరంలో గ్రాండ్‌గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. వభీమవరంలో ఈ వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఈ ట్రైలర్ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్‌లో ఉన్నదానికి పదింతలు సినిమాలో ఉంటుంది. ఈ ట్రైలర్ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ‘ఇరుముడి’ టైటిల్ ప్రకటించగానే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అద్భుతమైన వైబ్రేషన్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు అదే వైబ్రేషన్, అదే ప్రేమ చూపిస్తున్నారు. మీ ప్రేమ నాపై మరింత బాధ్యతను పెంచింది.

‘ఇరుముడి’ అంటే ఇద్దరికి పడిన ముడి. ఒక తండ్రికి, కూతురికి మధ్య ఉన్న ముడి.. అయ్యప్ప స్వామికి, ఆయన భక్తుడికి మధ్య ఉన్న ముడి.. అలాగే ఈ సినిమాలో ఉన్న ఒక క్రైమ్ చిక్కుముడి. ఈ మూడు చిక్కుముడులను కలిపి ‘ఇరుముడి’ అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ మూడు అంశాలను ఒక ఫ్యామిలీ డ్రామాలో కలిపి తీసుకురావడం ద్వారా సినిమా ఇచ్చే ఇంటెన్సిటీ మిమ్మల్ని అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. విజయ్ ఈ సినిమా ట్రైలర్‌ను చాలా అద్భుతంగా కట్ చేశాడు. రవితేజ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. మిగతా వాళ్లందరి గురించి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడతాను. ‘ఇరుముడి’ కేవలం ఒక సినిమా కాదు.. ఇది ఒక గొప్ప ఎమోషన్. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.