పళ్ళబురుసు హైలో హైలో హైలెస్సా సాంగ్ రిలీజ్

Hai Lo Hai Lo Hailessa Song from Pallaburusu Released

ఆకట్టుకునే ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన పళ్ళబురుసు’ టీమ్, ఇప్పుడు  ‘హైలో హైలో హైలెస్సా’ అనే ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాట సంప్రదాయ జానపద శైలికి మోడరన్ బీట్‌లను జోడిస్తూ ఆకట్టుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవన్ సీహెచ్ స్వరపరిచిన ఈ పాటకు సురేశ్ గంగుల సాహిత్యం అందించారు. శ్రీరామచంద్ర, లక్ష్మీ మేఘన తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు.క్యాచీ బీట్స్, సంప్రదాయ సంగీత వాయిద్యాల ఫ్లేవర్, ఆకట్టుకునే విజువల్స్‌తో పాట ఆద్యంతం ఆకట్టుకుంది.

‘హైలో హైలో హైలెస్సా’ పాటలోని ఎనర్జీ, జానపద టచ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. చిత్రం ప్రమోషన్స్‌లో ఈ పాట మరో ఆకర్షణగా  నిలిచింది.ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ‘పళ్ళబురుసు’ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలు. పవన్ సీహెచ్ సంగీతం అందిస్తుండగా, వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్.  ‘‘హైలో హైలో హైలెస్సా’తో ‘పళ్ళబురుసు’ ఆల్బమ్‌లో మరో సెలబ్రేషన్ సాంగ్ చేరింది.‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.