అశోక్ గల్లా, శ్రీగౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘విసా – వింటారా సరదాగా’. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ టీజర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ ఉద్భవ్ రఘు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమెరికా నేపథ్యంలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థుల జీవితాలు, అక్కడ వారి మధ్య చిగురించే స్నేహం, ప్రేమ మరియు వారు ఎదుర్కొనే వినోదాత్మక సవాళ్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తొలి టీజర్‌తోనే మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా, టీజర్ 2తో మరింత యూత్‌ఫుల్ అండ్ ఫ్రెష్ ఎంటర్‌టైనింగ్ వైబ్‌ను పంచింది. కథలోని నవ్వులు, ఎమోషన్స్ అలరించేలా ఉన్నాయని టీజర్ స్పష్టం చేస్తోంది.
ఈ చిత్రంలో అశోక్ గల్లా, శ్రీగౌరి ప్రియలతో పాటు రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి స్వరాలు, ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























