యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో శర్వానంద్, వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన ముద్ర వేసిన పవర్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది. వీరిద్దరి కలయికలో రాబోతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ‘జార్జ్ క్రిష్’ అనే వైవిధ్యమైన టైటిల్‌ను లాక్ చేశారు. శ్రీను వైట్ల మార్క్ టైమింగ్, కామెడీ కింగ్ శర్వానంద్ ఎనర్జీ తోడవుతుండటంతో ప్రాజెక్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.ఈరోజే ఈసినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 బరిలో నిలిపేందుకు మేకర్స్ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. పండగ వాతావరణానికి సరిగ్గా సరిపోయేలా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథాంశంతో ఈ సినిమాను రూపుదిద్దుతున్నారు. వినోదంతో పాటు యాక్షన్, ఎమోషన్స్ సమపాళ్లలో ఉండేలా శ్రీను వైట్ల ఈ స్క్రిప్ట్‌ను ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దినట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కనున్న ఈసినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























