ఇటీవల తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో స్వచ్ఛమైన మట్టి కథలతో చాలా సినిమాలు ప్రేక్షకులముందుకు వచ్చాయి.ఇందులో చాలా వరకు విజయం సాధించాయి. ఇక ఇప్పుడు తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలతో ‘శనార్తి’ అనే సినిమా తెరకెక్కనుంది.మాస్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ సంపత్ నంది మరియు కె.వి. శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ సమర్పిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. “మన నేలతో, మన మనసులతో ముడిపడిన కథ” అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ అనౌన్స్‌మెంట్ ప్రస్తుతం సినీ ప్రియులను ఎంతో ఆకట్టుకుంటోంది.తెలంగాణ భాషలో శనార్తి అంటే నమస్కారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో ‘రాజు వెడ్స్ రాంభాయ్’ ఫేమ్ అఖిల్ రాజ్ ఉద్దేమర్ కథానాయకుడిగా నటిస్తుండగా ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ కథానాయికగా చేస్తుంది.నాగదుర్గకు తెలుగులో హీరోయిన్ గా ఇది రెండో సినిమా. ప్రస్తుతం ఆమె ఇడుపుకాయితం అనే సినిమాకూడా చేస్తుంది.ఇక ఇప్పుడు శనార్తి లో అఖిల్ రాజ్ కి జంటగా కనిపించనుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యం, మట్టి వాసనలు కలబోసిన ఈ కథలో వీరిద్దరి కాంబినేషన్ సరికొత్త అనుభూతిని అందించబోతోంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విశ్వనాథ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఈసినిమాతో ఉప్పునూటి రాజ్ గణేష్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల కలబోతగా రూపొందుతున్న ఈ ఎమోషనల్ అండ్ నెటివిటీ డ్రామాకి సంబంధించిన మరిన్ని వివరాలను, టీజర్‌ను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























