టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే వారిలో సుధీర్ బాబు కూడా ముందుంటాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి తన ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. ఈ ఏడాది హంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో సుధీర్ మూడు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నాడు. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలో టీజర్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 22వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
The date for the TRIPLE IMPACT is locked. Durga, Parasuram & DJ are coming your way! 🤟🏻🤩
Nitro Star @isudheerbabu‘s #MaamaMascheendra TEASER Releasing on APRIL 22nd 💥@HARSHAzoomout @YoursEesha @mirnaliniravi @chaitanmusic @SVCLLP #SrishtiCelluloids @adityamusic pic.twitter.com/q28mJv1nTR
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) April 20, 2023
కాగా ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీజీ విందా సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: