విక్రమ్ లో ఆపాత్ర నేను చేయాల్సింది -లారెన్స్ 

Lawrence Reveals Interesting Facts about Vikram Movie

గత ఏడాది విడుదలై కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది విక్రమ్.కమల్ హాసన్ టైటిల్ రోల్ లో నటించిన ఈసినిమా తెలుగులోకూడా సూపర్  రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమాలో హీరో పాత్రతో పాటు రోలెక్స్,సంతానం పాత్రలు బాగా హైలైట్ అయ్యాయి.సంతానం పాత్రలో నెగిటివ్ షేడ్ లో కనిపించాడు విజయ్ సేతుపతి.ముఖ్యంగా సినిమాలో విజయ్ సేతుపతి ఎంట్రీ సీన్ ఫిదా చేస్తుంది.అయితే ఈసంతానం పాత్రను ప్రముఖ కొరియోగ్రాఫర్,హీరో..రాఘవ లారెన్స్ చేయాల్సిందట.మొదట ఈఆఫర్ తనకే వచ్చిందని అయితే డేట్ ఇష్యూ తో సినిమా వదులుకోవాల్సి వచ్చిందని లారెన్స్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక విక్రమ్ లో ఛాన్స్ మిస్ అయినా కానీ లోకేష్ కనగరాజ్ ప్రొడక్షన్ లో నటించే ఆఫర్ వచ్చినందుకు సంతోషంగా ఉందని లారెన్స్ అన్నాడు.లారెన్స్,నయనతార కలిసి రత్నకుమార్ డైరెక్షన్ లో హారర్ థ్రిల్లర్ లో నటించనున్నారు.ఈసినిమాకు లోకేష్ కనగరాజ్ స్టోరీ,స్క్రీన్ ప్లేను అందిస్తుండడంతోపాటు తనే ప్రొడ్యూస్ కూడా చేయనున్నాడు.

ఇదిలావుంటే గత శుక్రవారం రుద్రుడు అనే సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు లారెన్స్.ఈసినిమా తమిళ్ లో డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.కథిరేశన్ డైరెక్ట్ చేసిన ఈచిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా శరత్ కుమార్ విలన్ గా నటించారు.

లారెన్స్ ప్రస్తుతం చంద్రముఖి 2 అలాగే జిగర్తాండ డబుల్ ఎక్స్ లో నటిస్తున్నాడు.సూపర్ స్థార్ రజినీకాంత్ నటించిన కల్ట్ మూవీ చంద్రముఖి సీక్వెల్ గా వస్తున్నచంద్రముఖి 2లో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తుండగా పి వాసు డైరెక్ట్ చేస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.ఇక సూపర్ హిట్ మూవీ జిగర్తాండ కు సీక్వెల్ గా వస్తున్న జిగర్తాండ డబుల్ ఎక్స్ లో లారెన్స్ తోపాటు ఎస్ జె సూర్య లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 19 =