సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమా పుష్ప2. ఈసినిమా పుష్ప సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పార్ట్ 2 పై హై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందుకే సుకుమార్ కాస్త టైమ్ తీసుకొని పార్ట్ 2కోసం సాలిడ్ కథను రాసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఆవీడియోకు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో కూడా చూశాం. ఆ వీడియోతో పుష్ప గాడి రూల్ మొదలైందని మరోసారి నిరూపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసుకుంది ఈ వీడియో. ఇప్పటి వరకూ కూడా ఈ వీడియో 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాక 3.3 మిలియన్స్ కి పైగా లైక్స్ ను దక్కించుకుంది. ఈవిషయాన్ని మేకర్స్ కూడా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. దీంతో ఈ వీడియోకు వస్తున్న రెస్పాన్స్ చూసి చెప్పొచ్చు ఈసినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
PUSHPA RAJ ANNOUNCES HIS BLOCKBUSTER RULE 💥
Record Breaking 100M+ views and 3.3M+ likes for the #Pushpa2TheRule Glimpse 🔥#WhereisPushpa?
– https://t.co/eNEiADQGP0Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/RLPL4hetRR
— Mythri Movie Makers (@MythriOfficial) April 18, 2023
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: