లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఖైదీ, మాస్టర్ ఇక రీసెంట్ గా విక్రమ్ తో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇక చాలా గ్యాప్ తరువాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చి విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు కమల్ హాసన్. కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ లో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. కలెక్షన్స్ విషయంలో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను ఈసినిమా సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో మరో స్టార్ హీరో సూర్య కూడా ఒక చిన్న పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే కదా. సినిమా చివరిలో రోలెక్స్ పాత్రలో సూర్య ఎంట్రీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తుందన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు సూర్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను విక్రమ్ 2 ఎప్పుడు ఉంటుందని అడుగగా.. దానిపై స్పందించిన సూర్య ఆ పాత్రను చేయవలసిన సమయం వచ్చినప్పుడు చేస్తాననీ, అందుకు ఇంకా సమయం ఉందని సూర్య సమాధానమిచ్చాడు. లోకేశ్ తనని కలిసి కథ చెప్పినప్పుడు, విలన్ పాత్రే అయినా కమల్ సార్ కోసమే చేయాలనుకున్నాను .. చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు.
యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. ఫహద్ నటన, విజయ్ సేతుపతి విలనిజం సినిమాను మరో స్థాయికి చేర్చాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ సంయుక్తంగా నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: