అనుపమతో గొడవ గురించి క్లారిటీ ఇచ్చిన సిద్దు

Sidhu Jonnalagadda gives clarity about clashes with Anupama Parameswaran

డీజే టిల్లు తో ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.అప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈసినిమా తీసుకొచ్చి సిద్దూను రేస్ లోకి తీసుకొచ్చింది.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈచిత్రం గత ఏడాది విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో సిద్దు టైటిల్ రోల్ లో నటించగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.ఇక డీజే టిల్లు సక్సెస్ అవ్వడంతో సీక్వెల్ తీయాలనే ప్రతిపాదన తీసుకొచ్చింది ప్రొడక్షన్ హౌస్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందుకు సిద్ధూ కూడా ఓకే చెప్పాడు.ఇటీవలే ఈసినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో ఈసీక్వెల్ తెరకెక్కుతుంది. అయితే ఈసినిమాకు డైరెక్టర్, హీరోయిన్ మారిపోయారు.కథలో భాగంగా వేరే హీరోయిన్ ను తీసుకున్నారు. అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా ప్రకటించారు.అయితే కొన్ని రోజులు షూట్ జరిగిన తరువాత అనుపమ ఈసినిమా నుండి తప్పుకుందని సెట్ లో సిద్దు తో గొడవ పడడమే ఇందుకు కారణం అంటూ రకరకాల వార్తలు వచ్చాయి.ఈగొడవ గురించి సినిమా యూనిట్ ఎక్కడా స్పందించలేదు.ఈరూమర్స్ ఇంతటితో ఆగలేదు.వేరే హీరోయిన్ ను కూడా తీసుకున్నారని రోజుకో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. కట్ చేస్తే అనుపమ మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చింది.

అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో సిద్దు,అనుపమ తో గొడవ అలాగే డైరెక్టర్ ను తీసేయడం గురించి క్లారిటీ ఇచ్చాడు.అనుపమతో గొడవలాంటిది ఏమి లేదు అనుపమ కు డేట్స్ అడ్జెస్ట్ చేయడం కొంచెం ఇబ్బంది అయ్యింది.అందుకే మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చింది. ఆతరువాత సర్దుబాటు చేసుకుంది ఈలోగా ఏవేవో రూమర్స్ వచ్చాయి.ఈసినిమాకు మొదట అనుకుంది అనుపమనే.టీజర్ లో కూడా ఆమె పేరే వుంది.ఇప్పుడు షూటింగ్ లోకూడా అనుపమనే పాల్గొంటుంది. అలాగే విమల్ కృష్ణ ను తీసేసాం అని వార్తలు వచ్చాయి అందులో కూడా నిజం లేదు. ఈసీక్వెల్ గురించి విమల్ కు చెపితే మళ్ళీ ఇదే జోనర్ లో  సినిమా చేయలేను. వేరే జోనర్ లో పెద్దగా ప్లాన్ చేద్దాం అన్నాడు.అతని నిర్ణయాన్ని గౌరవించి నేనుఈ సీక్వెల్ పూర్తి చేస్తాను ఆ తరువాత ఇద్దరం మళ్ళీ వేరే సినిమా చేద్దాం అని అనుకున్నాం.సో అందుకే విమల్ కృష్ణ స్థానంలో మల్లిక్ రామ్ ను డైరెక్టర్ గా తీసుకున్నాం అంతే తప్ప వేరే ఏమి లేదని సిద్దు క్లారిటీ ఇచ్చాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 4 =