నటీనటులు :సమంత, దేవ్ మోహన్,మోహన్ బాబు,ప్రకాష్ రాజ్
సంగీతం : మణిశర్మ
ఎడిటింగ్ :ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ :శేఖర్ వి జోసఫ్
దర్శకత్వం :గుణశేఖర్
నిర్మాత : నీలిమ గుణ
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ లో నటించిన చిత్రం శాకుంతలం.మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈసినిమాను తెరకెక్కించాడు.ఇప్పటికే ప్రీమియర్ షో నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఈసినిమా రేపు థియేటర్లలోకి రానుంది.ఈసందర్భంగా శాకుంతలం ఎలా వుండబోతుందో చూద్దాం.
కథ :
దుష్యంతుడి ధైర్య సాహసాలు చూసి( దేవ్ మోహన్),శాకుంతల (సమంత) అతనితో ప్రేమలో పడుతుంది. దాంతో శకుంతలను గాంధర్వ వివాహంచేసుకుంటాడు దుష్యంతుడు.ఆతరువాత దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్లి వచ్చి నిన్ను తీసుకెళ్తానని శకుంతలకు చెప్తాడు కానీ ఎంతకీ దుష్యంతుడురాకపోవడంతో శంకుతలనే అతని దగ్గరకి వెళ్తుంది.కానీ దుష్యంతుడు ఆమెను అంగీకరించడు.ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగితా కథ.
హైలైట్స్ :
అభిజ్ఞాన శంకుతలంలో రాసిన ప్రేమకావ్యాన్ని అద్భుతంగా తెరమీదకు తీసుకొచ్చాడు దర్శకుడు గుణశేఖర్.సినిమాలో ఎమోషన్ మిస్ అవ్వకుండా పాత్రలను తీర్చిదిద్దాడు.క్యాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది.శకుంతలగా సమంత నటన సినిమాలో మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు.ఆమె పాత్ర తన కెరీర్ లో బెస్ట్ రోల్ గా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.అలాగే దుష్యంతుడి పాత్రలో నటించిన మలయాళం నటుడు దేవ్ మోహన్ కూడా చాలా బాగా చేశాడు.దుర్వాసముని పాత్ర మోహన్ బాబు కు బాగా సూట్ అయ్యింది.సప్రైసింగ్ రోల్ లో కనిపించిన అల్లు అర్హ క్యూట్ యాక్టింగ్ తో థ్రిల్ చేస్తుంది.
క్యాస్టింగ్ కి తోడు టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా సినిమాను నిలబెట్టింది.ముఖ్యంగా మణిశర్మ మ్యూజిక్ సినిమా కు చాలా ప్లస్ అయ్యింది.అలాగే శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.విజువల్స్ బాగున్నాయి.ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది.రన్ టైం కూడా తక్కువగా ఉండడం సినిమాకు ప్లస్ అయ్యింది.నిర్మాత నీలిమ గుణ బాగా ఖర్చు చేసి మంచి క్యాలిటీ తో సినిమాను నిర్మించింది.
తీర్పు :
ఓవరాల్ గా మైథలాజి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన శాకుంతలం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. సమంత,దేవ్ మోహన్ ల నటన, మణిశర్మ మ్యూజిక్,గ్రాఫిక్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఇక రేపు విడుదలకానున్న ఈసినిమా ప్రేక్షకులనుండి కూడా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడం ఖాయం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.