క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు గుణశేఖర్. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈసినిమా షూటింగ్ లో జరిగిన కొన్ని క్రేజీ థింగ్స్ గురించి చెప్పింది సమంత. తనకు ఫ్లవర్ ఎలర్జీ దగ్గర నుండి రాబిట్స్ కరిచిన విషయం వరకూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
* మొదటిగా ఫ్లవర్ ఎలర్జీ గురించి చెబుతూ.. నాకు ఫ్లవర్ ఎలర్జీ ఉంది.. అయితే ఈసినిమాలో నేను ఫ్లవర్ జ్యూలరీ పెట్టుకోవాలి.. నా చేతులకు, మెడలో ఫ్లవర్ జ్యూలరీ వేసుకొని ఉండాలి.. డే మొత్తం వాటితోనే షూటింగ్ చేయాలి.. అయినా కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా షూటింగ్ చేసేదాన్ని.. షూటింగ్ తరువాత ఆర్నమెంట్స్ తీసేస్తే వాటి ప్రింట్ పడేది. అది ఆరు నెలల వరకూ పర్మినెంట్ టాటు లాగ ఉండేది.. ఆ తరువాత కూడా నేను పైన మేకప్ వేస్తూ కవర్ చేసుకంటూ ఉండేదాన్ని.. తరువాత కొంతకాలానికి పోయింది.
* నేను మూడు లాంగ్వేజస్ లో డబ్బింగ్ చెప్పాను.. వేరే నటీనటులు ఎలా చెప్పేవారో నాకు తెలియదు కానీ ఇలా డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం.. నిద్రలో ఉన్నప్పుడు కూడా డైలాగ్స్ చెపుతుండేదాన్ని.. నేను అయితే బాగానే చెప్పానని అనుకుంటున్నాను.. ఆడియన్స్ రెస్పాన్స్ కోసం చూస్తున్నా అని తెలిపింది.
* మరో క్రేజీ విషయం ఏంటంటే నేను షూటింగ్ లో ఉన్నప్పుడు రాబిట్ నన్ను కరిచింది. రాబిట్స్ ఏం క్యూట్ గా ఉండవు అంటూ చమత్కరించింది.
* నీతూ లుల్లా ఈసినిమా కోసం చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో ఒక పాటలో 30 కేజీల లెహంగాను వేసుకోవాల్సి వచ్చింది. ఇక నేను లెహంగా వేసుకొని స్పిన్ చేసినప్పుడు ఫ్రేమ్ నుండి బయటకు వెళ్లిపోయేదాన్ని. డ్యాన్స్ మాస్టర్ రాజు ఫ్రేమ్ లో ఎందుకు ఉండట్లేదు అని అడిగేవారు. నేను ట్రై చేస్తున్నా.. కానీ లెహంగా వల్ల ఫ్రేమ్ బయటకు వెళ్లిపోతున్నా అంటూ చెప్పేదాన్ని.
* చివరిగా ఐదో విషయం ఏంటంటే ఈసినిమాలో నాది రియల్ హెయిర్ కాదు.. శాకుంతల పాత్ర కోసం విగ్ ను వాడాను అంటూ క్లారిటీ ఇచ్చింది.
మరి ఈసినిమాపై అయితే మంచి అంచనాలే ఉన్నాయి. దానికితోడు ప్రీమియర్ షో కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ శుక్రవారంతో అసలు రిజల్ట్ తెలిసిపోతుంది.
కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. విజువల్ వండర్‌గా త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా విడుదలవుతుంది. ఏప్రిల్ 14న 2D, 3D వెర్షన్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: