టాలీవుడ్ లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే ఉంది సమంత. తను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ తన రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అవకాశాల కోసం చూసింది లేదు. ఇప్పుడున్న కాంపిటీషన్ లో కూడా సమంత కోసం మేకర్స్ ముందుకు రావడం.. శాకుంతలం లాంటి సినిమా కోసం వందల కోట్లు పెట్డడం అంటే మాములు విషయం కాదు. సామ్ కూడా అందుకు తగ్గట్టుగానే తన నటనతో మేకర్స్ కు విజయాలను అందిస్తుంది. ప్రస్తుతం తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను తీసుకొని వెండితెరపై ఆవిష్కరించనున్నాడు. ఈసినిమా ఇంకా ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్స్ కోసం సమంత కూడా బాగానే కష్టపడుతుంది. రీసెంట్ గానే తాను మయోసైటిస్ నుండి కోలుకుంది. అయినా కూడా ఏమాత్రం బేఖాతరు చేయకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటుండగా.. తాజాగా సమంతను తనకు మయోసైటిస్ వ్యాది వచ్చినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటి అని అడుగగా దానికి సామ్.. ఫస్ట్ నేను షాక్ అయ్యాను.. నాకు ఎలా వచ్చింది అని అనుకున్నాను.. నేను హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాను.. వర్కవుట్స్ చేస్తున్నాను అయినా నాకు ఇలాంటి వ్యాధి ఎందుకు వచ్చిందన్నది మాత్రం అర్థంకాలేదు అని తెలిపింది.
కాగా గత ఏడాది సమంతకు మయోసైటిస్ ఎటాక్ అయ్యిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ట్రీట్ మెంట్ తీసుకుంటూ పోరాటం చేస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే సామ్ ఆ వ్యాధి నుండి బయటపడింది. సినిమాల షూటింగ్ లలో పాల్గొంటుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: