మళ్లీ పెళ్లి టీజర్ రిలీజ్ డేట్ వాయిదా

malli pelli movie teaser release date postponed

సినీ ఇండస్ట్రీలో ఎన్నే ఏళ్లు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన నరేష్ ఇన్నేళ్లకు మళ్లీ ప్రధాన పాత్రలో సినిమా చేస్తున్నాడు. దర్శకుడిగా సెకండ్ ఇన్నింగ్ ను మొదలుపెట్టిన ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మళ్లీ పెళ్లి. తెలుగు తో పాటు కన్నడ లో కూడా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇటీవల ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈరోజు ఈసినిమా టీజర్ రిలీజ్ అవ్వాలి.. కానీ ఇప్పుడు టీజర్ రిలీజ్ డేట్ వాయిదా పడింది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల టీజర్ రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే వెల్లడిస్తామని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు.

కాగా ఇంకా ఈసినిమాలో జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 1 =